Saturday, May 18, 2024

ఒడిశా జూలో తెల్ల ఆడపులి స్నేహ మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని తన ఎన్‌క్లోజర్‌లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ శుక్రవారం మరణించిందని అధికారులు వెల్లడించారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య చికిత్స అందిస్తున్నారు. దానికి స్లైన్, మందులు ఇచ్చారు. కాని అది శుక్రవారం మరణించింది. తెల్ల ఆడపులి వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో పాటు తీవ్ర ఉష్ణోగ్రత వల్ల బాధ పడుతోందని అధికారులు తెలిపారు.

రాయల్ బెంగాల్ టైగర్ నిషాన్‌కు, తెల్ల ఆడపులి కుసుమ్‌కు 2010 మార్చి 1న స్నేహ జన్మించింది. స్నేహ 2016 ఆగస్టు 5న మౌసుమి (ఆడ), చిను (మగ), విక్కీ (మగ) పిల్లలకు, రెండవ సారి గర్భం దాల్చినప్పుడు లవ్, కుశ్‌లకు జన్మ ఇచ్చింది. 2021 మార్చి 28న అది మూడ మగ పిల్లలు రాకేష్, రాకీ, బన్శీలకు జన్మ ఇచ్చింది. జైలో నిరుడు జూలై వరకు 27 పులులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News