Monday, May 13, 2024

విషమంగా మారిన మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మక్తల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని సొంత గ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పర్కాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఒకసారి అమరచింత నియోజకవర్గానికి సేవలు అందించగా మరో రెండు సార్లు మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం దయాకర్ రెడ్డి టిడిపి సభ్యునిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. భార్య సీతమ్మ దేవరకద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News