Monday, November 11, 2024

చంద్రునిపై 3డి ప్రింటింగ్‌తో నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

చంద్రునిపై నిర్మాణాలకు 3 డి ప్రింటింగ్ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశోధించడానికి తన చంద్రయాత్రలో పరిశీలించడానికి చైనా ప్రణాలికలు సిద్ధం చేస్తోంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అగ్రశాస్త్రవేత్త యూ వెయిరెన్ ఈ వివరాలు తెలియజేశారు. తాము చేపడుతున్న చంద్రయాత్ర చాంగ్‌యే 8 ప్రోబ్ చంద్రునిపై పర్యావరణం, ఖనిజ ధాతువుల సమ్మేళనం, తదితర లక్షణాలను పరిశీలించేలా రూపొందిస్తామని చెప్పారు. అలాగే 3 డి ప్రింటింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతికత చంద్రునిపై ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలించడమౌతుందని చెప్పారు.

చంద్రునిపై తాము సుదీర్ఘకాలం నివసించాలన్న అభిలాష కలిగితే చంద్రునిపై లభించే ఖనిజాలు, ఇతర పదార్ధాలతోనే స్థావరాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. టోంగ్‌జీ యూనివర్శిటీ, జియాన్ జియావోటాంగ్ యూనివర్శిటీ వంటి స్వదేశీ యూనివర్శిటీలు ఇప్పటికే చంద్రునిపై 3 డి ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాయి. చాంగ్ యె 6, చాంగ్ యె 7 చంద్రయాత్రల తరువాత చాంగ్ యె 8 మూడో చంద్ర యాత్ర అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News