Wednesday, May 15, 2024

బెంగళూరులో వస్తువుల నీడలు మాయం: ‘జీరో షాడో డే’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ‘జీరో షాడో డే’ అని పిలిచే ఓ ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయాన్ని బెంగళూరు ప్రజలు చూశారు. మంగళవారం బెంగళూరులో స్వల్పకాలానికి నిలువు వస్తువులు నీడ లేకుండా మారాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12.17 గంటలకు జరిగినట్లు సమాచారం.

ఈ దృగ్విషయం చాలా అరుదు, సంవత్సరాల తర్వాత ఎంచుకున్న ప్రదేశాలలో జరుగుతుంది. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఎ) మంగళవారం తన క్యాంపస్‌లో దీనికి సంబంధించిన ఈవెంట్‌లను నిర్వహించింది. ‘జీరో షాడో డే #ZSDని మన కోరమంగళ క్యాంపస్‌లో 25 ఏప్రిల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరుపుకోండి. సూర్యుడు నేరుగా మధ్యాహ్నం 12.17 గంటలకు నిటారుగా నెత్తిపైకి వస్తాడు’ అని ఐఐఎ మంగళవారం ట్వీట్ చేసింది. ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడడంతో పాటు, చాలామంది ట్విట్టర్ ద్వారా వస్తువుల నీడ మాయమవుతున్న దృశ్యాల వీడియోలను పంచుకున్నారు.

‘నగరంలోని అన్ని నిలువు వస్తువులు మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ లేకుండా ఉన్నాయి! సూర్యుడు నడినెత్తిమీదకు రావడం అన్నది సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. #zeroshadowday#Bengaluru’అని ఒకరు ట్వీట్ చేశారు.
‘జీరో షాడో డే అనేది +23.5 నుంచి –23.5 డిగ్రీల అక్షాంశల మధ్య ఉన్న ప్రదేశాలలో సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఖగోళ సంఘటన. ఈ సందర్భంగా సూర్యుని క్రింద ఉన్న ఏదైనా వస్తువు దాని నీడను కోల్పోతుంది. సూర్యుని ఉత్తరాయనం, దక్షిణాయనం సమయాల్లో ఇది సంభవిస్తుంటుంది. ఈ రెండు రోజుల్లో సూర్యుడు నడి నెత్తి మీదకు వస్తాడు. వస్తువుల నీడలు లుప్తమవుతాయి’ అని ఎఎస్‌ఐ తన వెబ్‌సైట్‌లో రాసింది. అయితే ఈ దృశ్య ఘట్టం కేవలం ఓ సెకండ్ మాత్రమే ఉంటుంది. కానీ దాని ప్రభావాన్ని రెండు నిమిషాల వరకు చూడొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News