Sunday, June 9, 2024

తెలంగాణ ఎన్నికల అధికారులపై స్వల్ప లాఠీ ఛార్జ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణలో మే 13న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికల సంఘం ఇస్తానన్నంత డబ్బు ఇవ్వకుండా తక్కువ ఇవ్వడంపై కొందరు తెలంగాణ పోల్ అధికారులు నిరసన తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకారం టీచర్లకు నారాయణఖేడ్ సెగ్మెంట్ లో  ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్(ఏపిఓస్)గా ఎన్నికల విధులను వేశారు. విధులు నిర్వహించిన తర్వాత వారికి రూ. 3150 ఇస్తామని చెప్పి చివరికి రూ. 2400 మాత్రమే చేతిలో పెట్టారని తెలిసింది.

ఎన్నికల అధికారుల విధులు నిర్వహించింది స్థానిక టీచర్లు. తమ విధులకు పూర్తి చెల్లింపులను వారు డిమాండ్ చేయగా, అక్కడే  ఉన్న పోలీసులు వారిపై స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. అయితే ఈ రచ్చను పరిష్కరించే దిశలో ఇద్దరు తహసిల్దారులు వారికి పూర్తి పేమెంట్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News