Saturday, July 27, 2024

9-13 మావే

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ కోసం రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు
హైదరాబాద్ యుటి అయ్యే అవకాశం లేదు
రెండో రాజధాని చేసినా ఆదాయం తగ్గదు
కెటిఆర్‌ది మిడిమిడి జ్ఞానం రేషన్‌కార్డులపై
పరిమితి లేదు..అది నిరంతర ప్రక్రియ ఎపిలో
ఎవరు అధికారంలోకి వచ్చినా సత్సంబంధాలను
కొనసాగిస్తాం నేటి నుంచి సచివాలయానికి వెళ్తా
మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం చూసుకుంటుంది
మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్

బిజెపి గాలి లేదు..కొన్ని చోట్ల బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి వేవ్ లేదని, ఆరేడు స్థానాల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని, రాష్ట్రంలో 9 నుంచి 13 సీట్లను గెలుచుకుంటామని సి ఎం రేవంత్ పేర్కొన్నారు. మెదక్‌లో బిజెపికి మూడోస్థానం ఉంటుందన్నారు. గత అసెం బ్లీ ఎన్నికల్లో తమకు బిఆర్‌ఎస్ పోటీ ఇచ్చిందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పోటీ అని సిఎం రేవంత్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. బిఆర్‌ఎస్ అదే చేస్తుందని ఆయన ఆ రోపించారు. కేంద్రంలో బిజెపికి 220 నుం చి 230 సీట్లు వస్తాయని ఆయన జోస్యం చె ప్పారు.

మంగళవారం సిఎం రేవంత్‌రెడ్డి మీ డియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్‌లో గతంకన్నా మెరుగైన ఓటింగ్ పోలయ్యిందన్నారు. 20 వేల మెజార్టీతో సికింద్రాబాద్ స్థానాన్ని గెలుచుకుంటామని ధీ మా వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనను జాతీ య స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ నాయకులు బిజెపికి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. నిన్నటి తో రాజకీయ కార్యకలాపాలే ముగిశాయని, నేటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పె డతానని తెలిపారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై అధికారులతో సమావేశం నిర్వహిస్తానని, విద్యార్థులకు పుస్తకాలు, సన్నబి య్యం, యూనిఫాంలకు సంబంధించి సమీ క్ష జరుపుతానని సిఎం రేవంత్ తెలిపారు.

కెటిఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు….

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చే సే అవకాశం లేదని ఆయన తెలిపారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేసినా ఆదాయం తగ్గదని సిఎం పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని  మాట్లాడేటోడికి మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని ఆయన దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదని, కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదని సిఎం రేవంత్ తెలిపారు. కెటిఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కెటిఆర్ డిమాండ్ చేశారు కదా అని రేవంత్ ప్రశ్నించారు.
అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తాం

ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామని సిఎం రేవంత్ తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా రుణాన్ని తీసుకొని రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ నెల 06వ తేదీ నాటికి రైతుబంధును పూర్తిగా ఇచ్చేశామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సిఎం రేవంత్ చెప్పారు. రైతులను ఒకేసారి రుణవిముక్తులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల ద్వారా ఎక్కువ ధర వస్తువులను తక్కువకు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకులను ఇస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వీటితో పాటు రైతు పండించే వాటిలో కొన్నింటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకుంటామని, అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తామని, ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

రేషన్ కార్డులపై పరిమితి లేదు

రేషన్ కార్డులపై పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు సంబంధం ఉండదని ఆయన తెలిపారు. కార్పొరేట్ విద్య, వైద్యంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి సచివాలయానికి వెళ్తానని, ఎన్నికల ముందు వెళ్తే విమర్శలు వస్తాయని వెళ్లలేదని సిఎం రేవంత్ తెలిపారు. అత్యవసర అంశాలపై నిర్ణయాలకు ఎన్నికల నియమావళి అడ్డురాదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం కానుందని సిఎం రేవంత్ అన్నారు.

ఎపిలో ఎవరూ అధికారంలోకి వచ్చినా….

ఇక, ఎపిలో ఎవరూ అధికారంలోకి వచ్చినా ఇరురాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఎపిలో షర్మిల గెలవాలని ఆయన కోరారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నెగిటివ్ ఆలోచనలు లేవని, తనకు తెలంగాణ ముఖ్యమని అన్నారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో వందేళ్ల విజన్ అందించాలన్నదే తన పాలసీ అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం ఉంటుందని రేవంత్ తెలిపారు. కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెడతామని, అన్ని యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్‌లను నియమిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో తప్పులు ఎవరు చేసినా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ అభివృద్ధి

వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని సిఎం రేవంత్ తెలిపారు. ఎయిర్ పోర్ట్, ఐటీ రంగాన్ని కూడా వరంగల్ లో ఏర్పాటు చేస్తామని సిఎం పేర్కొన్నారు. మరోవైపు ఉచిత బస్సుతో మెట్రో నష్టపోతుందని అమ్ముకుంటామని ఎల్ అండ్ టి అన్న కామెంట్స్‌పై రేవంత్ ఫైర్ అయ్యారు. మెట్రోను అమ్ముకుంటే అమ్ముకోమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మరోవైపు కెసిఆర్ ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే గౌరవంగా ఉంటుందా, ఇప్పుడు ఏం మాట్లాడినా పరువు తక్కువ అని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానం చూసుకుంటుందని,
ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇస్తామని ఆయన తెలిపారు. టికెట్లు ఇచ్చిన వాళ్లకు మళ్లీ పదవులు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News