Sunday, June 9, 2024

20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగ ఎందుకు మురికి పట్టింది?

- Advertisement -
- Advertisement -

తాను దత్తత తీసుకున్న వారణాసి గ్రామాలను మోడీ ఎందుకు వదిలేశారు?
వారణాసిలో ‘వైఫల్యాలకు’ ప్రధాని జవాబు ఇవ్వాలి
కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తాను దత్తత తీసుకున్న వారణాసి గ్రామాలను ఎందుకు వదిలేశారని, రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగా నది ఎందుకు మురికిగా తయారైందని కాంగ్రెస్ మంగళవారం ప్రశ్నించింది. ప్రధాని మోడీ వారణాసి నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజుల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందిస్తూ, మాజీ ప్రధాని కానున్న మోడీ వారణాసిలో తన ‘వైఫల్యాలకు’ సమాధానం ఇవ్వాలని కోరారు. ‘ఇప్పటి ప్రశ్నలు: రూ. 20 వేల కోట్లు వ్యయం చేసిన తరువాత గంగ ఎందుకు మురికి పట్టింది? తాను ‘దత్తత’ తీసుకున్న వారణాసి గ్రామాలను ప్రధాని ఎందుకు వదిలేశారు? వారణాసిలో మహాత్మా గాంధీ వారసత్వ సంపద విధ్వంసానికి ప్రధాని ఎందుకు కృతనిశ్చయంతో ఉన్నారు?’ అని రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మోడీ 2014లో వారణాసికి వచ్చినప్పుడు ‘మా గంగా నే ముఝే బులాయా హైహ’ (గంగా మాత నన్ను పిలిచింది) అని చెప్పారని, పవిత్ర గంగ జలాలను పరిశుద్ధం చేస్తానని వాగ్దానం చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ‘ఆపరేషన్ గంగ’ పేరును ‘నమామి గంగే’గా మార్చారని రమేష్ విమర్శించార. ‘పది సంవత్సరాల తరువాత ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 20 వేల కోట్లక పైగా ఖర్చు చేయించింది. ఫలితాలు ఇవిగో: కలుషిత నది ప్రాంతాలు 51 నుంచి 66కు పెరిగాయి. ప్రమాదకర బ్యాక్టీరియా సురక్షిత స్థాయిల కన్నా 40 రెట్లు అధికంగా ఉందని, యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియా ఇప్పుడు ఆ నీటిలో కనిపిస్తోందని 71 శాతం పర్యవేక్షక కేంద్రాలు తెలిపాయి’ అని ఆయన పేర్కొన్నారు.

పన్ను చెల్లింపుదారుల డబ్బులో రూ. 20 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? అవినీతిలో, నిర్వహణ లోపంలో ఎంత డబ్బు మళ్లించారు? తుదకు గంగా మాతనూ మోసగించిన వ్యక్తిని వారణాసి ప్రజలు ఏవిధంగా విశ్వసిస్తారు?’ అని రమేష్ ప్రశ్నించారు. వారణాసి నగరం వెలుపల గల ఎనిమిది గ్రామాలను ప్రధాని ‘దత్తతకు తీసుకున్నారు’ అని, కాని గత మార్చి వాస్తవ నివేదిక ప్రకారం ‘స్మార్ట్ పాఠశాలలు’, ఆరోగ్య సౌకర్యాలు, గృహవసతికి సంబంధించి బడా వాగ్దానాలు చేసినప్పటికీ ఆ గ్రామాల్లో పది సంవత్సరాల్లో పురోభివృద్ధి ఏమీ లేదని కూడా రమేష్ విమర్శించారు. ‘ప్రధానిస్వదేశంలో గాంధేయ సంస్థలను ధ్వంసం చేస్తూ విదేశాల్లో గాంధీజీపై ఎందుకు ప్రశంసలు కొనసాగిస్తున్నారు? తనకు గాంధీపై కన్నా గాడ్సేపైనే అభిమానం అనిఆయన బాహాటంగా అంగీకరిస్తారా?’ అని కూడా రమేష్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News