Wednesday, May 29, 2024

‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. రజినీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News