Tuesday, September 16, 2025

బావిలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి స్థానికులు, పోలీసులు తెలిపన కథనం ప్రకారం. రాష్ట్రంలోని దార్ జిల్లా శ్యాంపూర్ లో ఓ బావిలో ముగ్గురు బాలికల మృతదేహాలను నీటిపే తేలియాడుతుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనకు స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహయంతో మృతదేహాలను బయటకు తీశారు.

అయితే బావి వద్ద ముగ్గురు చిన్నారుల చెప్పులు, ఒక మహిళ చెప్పులను పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతిచెందిన బాలికలను అక్కచెల్లెళ్లుగా గుర్తించారు. అక్కచెళ్లెల్లతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని తల్లి మృతదేహం కోసం పోలీసులు బావిలో వెతుకుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: విశాఖ బీచ్ లో అర్ధనగ్నంగా యువతి మృతదేహం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News