Monday, May 6, 2024

పెద్దపేగు క్యాన్సర్‌తో గర్భధారణ చిక్కులు

- Advertisement -
- Advertisement -

పెద్ద పేగు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే మహిళల్లో పుట్టబోయే బిడ్డల్లో ప్రతికూల ఫలితాలు, అసమానతలు ఎక్కువయ్యే రిస్కు ఉండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. “ఇ క్లినికల్ మెడిసిన్‌” లో వెలువడిన ఈ అధ్యయనంలో పెద్దపేగు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే మహిళల్లో 207 ప్రసవాలను, సరిపోలిన నియంత్రణ లోని 1019 ప్రసవాలను విశ్లేషించారు. పెద్దపేగు క్యాన్సర్ ముందుగా లేని మహిళలతో పెద్దపేగు క్యాన్సర్ ముందుగా గుర్తించే మహిళలతో పోల్చి చూడగా, 2.5 రెట్లు ఎక్కువగా ప్రిఎక్లాంప్సియా చిక్కులు కనిపించాయి. అత్యవసర సిజేరియన్ డెలివరీ కేసుల్లోనూ 79 శాతం ప్రతికూలతలు కనిపించాయి.

ప్రిఎక్లాంప్సియా అన్నది అత్యధిక రక్తపోటుతో ప్రమాదకరమైన గర్భధారణ సమస్య. పెద్దపేగు క్యాన్సర్ ముందస్తు జననాల్లోనూ 2.3 రెట్లు ప్రతికూలతలు చూపిస్తుంది. ముఖ్యంగా వైద్యపరంగా ప్రేరేపిత ముందస్తు జననాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి కలిగిన మహిళల్లో వైద్యచికిత్స విషయంలో ఇప్పుడు వెలువడిన అధ్యయనాలు కీలకమైన సాక్షాధారాలుగా ఉంటాయని అమెరికా లోని సెయింట్ లూయిస్‌కు చెందిన వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని సర్జరీ అండ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యిన్ కావో వివరించారు. అయితే పెద్దపేగు క్యాన్సర్ ముందుగా గుర్తించే మహళలకు పుట్టే బిడ్డల్లో పుట్టుకతో వచ్చే వైకల్యాలు, అసమానతలు తాము కనుగొనలేదని చెప్పారు.

Also read: పురుషుల్లో వ్యంధత్వానికి వీలు కల్పించే కొత్త జన్యువు

50 ఏళ్లకు ముందే పెద్దపేగు క్యాన్సర్ ముందుగాపె గుర్తించే మహిళల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఫలితంగా గర్భధారణ సమయంలో పెద్దపేగు క్యాన్సర్ ముందుగా గుర్తించే వారి సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్ బాధితులైన వారిలో గర్భధారణ , నవజాత శిశు జననాలపై అధ్యయనాలు కౌమార, యువవయోజన క్యాన్సర్ రోగుల జననేంద్రియాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. పేగు క్యాన్సర్ దృష్టితో ఈ అధ్యయనాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు పేగు క్యాన్సర్ బాధితుల ప్రసవాలకు సంబంధించి వైద్యపరమైన నిబంధనల్లో ఇంకా నిర్ధిష్టమైన సిపార్సులేవీ చేర్చలేదు.

Also read: ప్యాంక్రియాటైటిస్ పై అశ్రధ్ధ పనికిరాదు

పెద్దపేగు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుదల
మన జీర్ణవ్యవస్థలో పెద్దపేగు చివరన ఉంటుంది. ఆహారం లోని నీటిని, పొటాసియం, కొవ్వు లోని కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. శరీరం లోని వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తుంది. ఈ పెద్దపేగు క్యాన్సర్‌తో ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 నుంచి 2040 మధ్యలో ఈ కేసులు 56 శాతం పెరిగే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ క్యాన్సర్ (ఐఎఆర్‌సి) అంచనా వేసింది. అలాగే సంవత్సరానికి 3 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని పేర్కొంది. 2040 లో ప్రపంచ వ్యాప్తంగా దీనివల్ల దాదాపు 1.6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతారని కూడా హెచ్చరించింది.

Also read: బాలికల చదువుకు బహిష్టు చిక్కులు

పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు…
పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారికి ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం. కొన్ని రోజులు విపరీతమైన మలబద్దకం. కొన్ని రోజులు విరేచనాలు కూడా అవుతుంటాయి. పొట్టకింద నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉంటాయి. రక్తం వల్ల మలం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి, బలహీనత, అలసట కనిపిస్తాయి.శరీరం బరువు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి. పీచు పదార్ధాలు లేని జంక్‌ఫుడ్ తినడం అతిగా ఆల్కహాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం, తదితర అవలక్షణాల వల్ల ఈ వ్యాధి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ రోగుల్లోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

Also read: కోలుకోలేని వ్యాధి అమిలోయిడోసిస్

నివారణ మార్గాలు…
పెద్దపేగు క్యాన్సర్ నివారణ మార్గాల్లో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు ఉంటుంది. రెడ్‌మీట్ వంటి మాంసాహారం తగ్గించి, చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. పొగతాగడం, మద్యపానం మానేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News