Saturday, May 25, 2024

పంట నేలపాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/భీమరదేవరపల్లి : రాష్ట్రంలో పలుచోట్ల ఆదివా రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం అపారనష్టాన్ని తె చ్చి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. విద్యు త్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ అంతరాయం కలిగింది. ఇండ్ల పైకప్పులు కూలి పోయాయి. పిడుగు పాటుకు ముగ్గురు బలయ్యారు. అనేక చోట్ల పశువులు మృత్యువాత పడ్డాయి. కొన్ని చోట్ల ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. దీం తో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరంగల్ జిల్లాలో వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరు పు లతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మంలో ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. నల్గొండ జిల్లాలో అక్కడ క్కడ తేలికపాటి వర్షం కురిసింది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందా రు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రైతు బాస బుల్లయ్య (46), జనగామ జిల్లా రఘునాథపల్లిలో రైతు దాసరి అజయ్(39) పిడుగు పా టుకు మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు పట్టణలో ఆదివారం సా యంత్రం కురిసిన అకాల వర్షంతో పిడుగుపాటుకు గురై ఓ మహిళా రైతు మృ తి చెందింది. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ముఖ్యంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి వేగానికి పలుచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అక్కడక్కడ పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. నల్గొండ జిల్లాలోని చిట్యాల్ లోని శాంతి నగర్ లో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈదురు గాలులకు చెట్లు కూలిపోయాయి. మహబూబా బాద్ జిల్లా కేసముద్రంలో ఉరుములుతో కూడిన వర్షం వల్ల కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పొసిన మొక్కజొన్న, వరి రాశులు తడిసి పోయాయి. ధాన్యం రాశుల్లోకి వర్షం నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో వచ్చే 5 రోజులు వర్షాలే
భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల ఐదు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరు పులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరో వైపు పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. సోమవారం ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్,

, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల,జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News