Monday, June 17, 2024

గన్ పౌడర్ కంపెనీలో పేలుడు: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో గన్ పౌడర్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బెర్లా బ్లాక్ లోని బోర్సి గ్రామ శివారులో గన్ పౌడర్ కంపెనీలో పేలుడు సంభవించడంతో 17 మంది మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాయ్‌పూర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News