Monday, June 17, 2024

ఆ వికెట్ కీపర్ తరువాత రికార్డులన్నీ దినేష్ కార్తీక్ వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రికెటర్ దినేష్ కార్తీక్ ఐపిఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డికె ఇప్పటి వరకు ఆరు జట్ల నుంచి ఆడాడు. ఢిల్లీ, పంజాబ్, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు జట్ట నుంచి ఆడాడు. ఐపిఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడికి డికె(257) రికార్డు సృష్టించారు. తొలి స్థానంలో ధోని(264), తరువాత రోహిత్ కూడా 257 మ్యాచ్‌లతో సమానంగా ఉన్నాడు. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో కీపర్‌గా(174) ఉన్నాడు. 137 క్యాచ్‌లు పట్టగా 37 స్టంప్స్ చేశాడు. ధోనీ 190 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

నాలుగు అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ దిగి 4097 పరుగులు చేయగా ధోని 5047 పరుగులలతో తొలి స్థానంలో ఉనాడు. డేత్ ఓవర్లలో(17 నుంచి 20) 1565 పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా ధోనీ(2786) తొలి స్థానం, కీరన్ పొలార్డ్(1709) రెండో స్థానంలో ఉన్నారు. ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసి జాబితతో కార్తీక్(4842)తో పదో స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్ (4463) పరుగులతో రెండో స్థానంలో ఉండగా ధోనీ(5125)తో తొలి స్థానంలో ఉన్నాడు. ఐపిఎల్‌లో అత్యధిక ఆటగాళ్లతో మైదానం పంచుకున్న ఆటగాడి డికె(187) తొలి స్థానంలో ఉండగా వరసగా అజింక్య రహానే(168), శిఖర్ ధావన్(167) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News