Wednesday, April 2, 2025

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈవిఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని, ఈవిఎంలను బహిష్కరించాలని ప్రముఖ కెపిటలిస్ట్ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ (ఎక్స్)పై రాహుల్ గాంధీ స్పందించారు.

భారత్ లోని ఈవిఎంలు బ్లాక్ బాక్స్ వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించరని ఆరోపించారు. ఇలాంటివి చూస్తుంటే  ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రస్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవస్థలో జబాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మొబైల్ ఫోన్ సాయంతో ఈవిఎంలను హ్యాక్ చేసిని ఆరోపణలపై ముంబై ఎంపీ బావమరిది మీద కేసు నమోదైన వార్తా క్లిప్పింగ్ ను రాహుల్ గాంధీ తన ట్వీట్ లో జత చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News