Tuesday, June 18, 2024

పట్ట భద్రుల ప్రచారం ఇక బంద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే ఎంఎల్‌సి ఉపఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూ పాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సిఇఒ సూచించారు. ప్రైవేట్ కంపెనీలు,

వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచే ్చందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు. ఎంఎల్‌సి ఉపఎన్నిక ప్రచారానికి శనివారం తెరపడనున్నది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటల కు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం (మే 25) సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి.

ఎంఎల్‌సి ఉప ఎన్నికకు సర్వసిద్ధం
వరంగల్ -ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఎంఎల్‌సి ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో మొత్తం 58 అభ్యర్థులు ఉండగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News