Monday, June 17, 2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ప్రధాన నిందితుడిగా ఉన్న వాసు ముఖ్య అనుచరుడు..కేసులో రెండో నిందితుడు(ఏ2) అయిన అరుణ్ కుమార్ ను బెంగళూరు క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాక రేవ్ పార్టీలను కూడా నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

ఇదిలావుండగా బెంగళూరులోని బిఆర్ ఫామ్ హౌజ్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సిసిబి పోలీసులు నోటీసులు జారీచేశారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. కాగా రేవ్ పార్టీ నుంచి తప్పించు పారిపోయిన పూర్ణా రెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో నటి హేమ, ఆషీ రాయ్ కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News