Monday, June 17, 2024

కేన్స్ లో రికార్డు సృష్టించిన అనసూయ

- Advertisement -
- Advertisement -

కేన్స్: 77వ కేన్స్ వేడుకలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. కేన్స్‌లో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా రికార్డు సృష్టించారు. “అన్ సర్టెయిన్ రిగార్డ్” విభాగంలో అనసూయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు గెలిచి తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. “ది షేమ్‌లెస్” చిత్రంలో ఆమె నటకు ఈ అవార్డు వరించింది. రేణుక అనే సెక్స్ వర్కర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రాన్ని నేపాల్, భారత్ నెల రోజుల పాటు షూటింగ్ చేశారు. కేన్స్ ఉత్సవానికి ఈ ది షేమ్‌లెస్ సినిమా ఎంపిక కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు.

Best actress award anasuya in Cannes

అనసూయ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లో ని కోల్‌కతా నివాసం ఉండేవారు. ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. దర్శకుడు బొజనోవ్, అనసూయ ఫేస్‌బుక్ స్నేహితుడు కావడంతో ఆడిషన్ టేప్ పంపమని కబురు పంపాడు. ఆడిషన్ నచ్చడంంతో ఆమెకు ది షేమ్‌లెస్ సినిమాలో దర్శకుడు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె సెక్స్ వర్కర్ పాత్రలో నటించారు. ఢిల్లీలోని బ్రోతల్ హౌస్‌లో పోలీసులకు ఆమె పట్టుబడింది. దీంతో ఏం చేయలో తోచక పోలీసులను చంపి ఆమె అక్కడి నుంచి పారిపోయింది. మన రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం తీసుకుంది. అక్కడ 17 ఏళ్ల దేవికతో ప్రేమాయణం కొనసాగిస్తుంది. సమాజంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి ఇద్దరు జీవితంలో ఎలా ముందుకు సాగారనేది కథాంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News