Sunday, June 16, 2024

కేన్స్ లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ కు ఫస్ట్ బహుమతి…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగా వైభవంగా జరిగింది. కేన్స్ 2024లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్‌కు ఫస్ట్ బహుమతి లభించింది. భారత్‌కు చెందిన ‘సన్‌ప్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే సినిమా 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానం దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను కన్నడ జానపద కథ ఆధారంగా చిదానంద అనే వ్యక్తి తెరకెక్కించాడు. షార్ట్ ఫిల్మ్ నిడివి 16 నిమిషాలు ఉంటుంది. ఓ వృద్ధురాలు కోడిని ఎవరో దొంగలించడంతో దాని కోసం ఆమె పడే తపన ఈ చిత్రంలో కనిపిస్తుంది. హాలీవుడ్‌తో పోటీపడి మొదటి బహుమతి గెలుచుకోవడంతో సినిమా బృందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మేరఠ్‌కు చెందిన మహేశ్వరి తెరకెక్కించిన ‘బన్నీహుడ్’ చిత్రానికి తృతీయ బహుమతి వచ్చింది. రెండు భారతీయ సినిమాలు టాప్ -3లో రెండు బహుమతులు రావడంతో భారత దేశ ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పారు. మొదటి బహుమతికి 15000 యూరోలు, మూడో బహుమతి 7500 యూరోలు ఇవ్వనున్నారు. మే 23న బునుయెల్ థియేటర్‌లో అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. టాలీవుడు హీరో మంచు విష్ణు నటించి కన్నప్ప టీజర్‌ను కూడా కేన్స్‌లో ప్రదర్శించారు. దీంతో మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News