Wednesday, June 19, 2024

ఆ ఎంపిని దారుణంగా చంపి…. మృతదేహాన్ని ముక్కలుగా నరికి…. చర్మాన్ని వలిచి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపి మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్‌ను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎంపి మహమ్మద్ అన్వర్ ఉల్ చికిత్స నిమిత్తం పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాకు వచ్చాడు. టౌన్‌హాల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లారు. మహిళతో హనీట్రాప్ చేయించి సదరు ఎంపిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్ లో అన్వర్ గొంతు నులిమి చంపారు అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దుర్వాసన రాకుండా పసుపు పూయడంతో పాటు ఫ్రీజులో భద్రపరిచారు. శరీర భాగాల అనవాళ్లు తెలియకుండా ఉండటానికి చర్మాన్ని వలిచారు. అనంతరం శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి పలు ప్రదేశాలలో పడేశాడు.

బంగ్లాదేశ్ ఎంపి అదృశ్యం కావడంతో విచారణలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన వలసదారు జిహాద్ హవల్దార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరు జమాన్ సదరు ఎంపికి మంచి స్నేహితుడిగా ఉన్నాడు. అఖ్తరు జమాన్ చెప్పడంతో తాము సదరు ఎంపిని చంపేశామని పోలీస్ విచారణలో హవల్దార్ ఒప్పుకున్నారు. మే 12న కోల్‌కతాలోని మరో స్నేహితుడి ఇంట్లో మహమ్మద్ అన్వర్ బస చేశారు. పని ఉందని బయటకు వెళ్లిన ఎంపి తిరిగి రాకపోవడంతో ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా హవల్దార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య చేశానని ఒప్పుకున్నాడు. అమెరికాలో ఉండే అఖ్తరు జామన్ హత్య చేయమని చెప్పడంతో తాము మర్డర్ చేశామని హవాల్దార్ ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News