Monday, June 17, 2024

ధూం..ధాంగా దశాబ్ధి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆవిర్భావ దినోత్సవాన్ని (జూన్2వ తేదీని) ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్ర స్తుతం రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావస్తుండడంతో పండుగను ఊరువాడలా ఘనంగా నిర్వహించాలని ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. ఆవిర్భావ వే డుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణ యం తీసుకుంది. దీంతోపాటు అదే రో జు రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగా ణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో గీతంతో పాటు రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరించే అవకాశం ఉందని అధికారు లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన

5 నెలల్లోనే ఈ వేడుకలు జరుగుతుండగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తేదీన దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగియనుండగా జూన్ 4వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ దేశమంతా అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవడంతో ఈ వేడుకలను కనివినీ రీతిలో జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2వ తేదీని) పురస్కరించుకొని సిఎం రేవం రెడ్డి గన్‌పార్కులో అమరవీరులకు నివాళ్లు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు.

పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎంఎం కీరవాణి ఆలపించనున్న ‘జయ జయహే తెలంగాణ’ పాట
జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటను అమల్లోకి తీసుకురావాలని దానికోసం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించనున్నారు. ఈ గేయం ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొందింది. అందరిలోనూ స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం ఈ గేయం నిడివి సుమారు రెండు నిమిషాలకు కుదించడంతో పాటు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం.

రాష్ట్ర అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాల ఆవిష్కరణ….
అలాగే సవరించిన రాష్ట్ర అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా జూన్ 2వ తేదీన వాటిని ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టుగా అధికారవర్గాల సమాచారం.
సోనియాగాంధీకి సత్కారం…
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించి సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఉద్యమకారులను సైతం ప్రభుత్వం సన్మానించనుంది. సన్మానం చేయాల్సిన ఉద్యమకారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

కొత్త పథకం లేదా ఆరు గ్యారంటీల్లో ఒక దానిని ప్రకటించే…..
మరోవైపు ఆరు గ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే టిఎస్ పేరును టిజిగా ప్రభుత్వం మార్చింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్‌సైట్‌లను ప్రభుత్వం పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండలం, పంచాయతీల్లోనూ అవతరణ వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈసారి వినూత్నంగా వేడుకలు
ఈ సారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన తన ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వేడుకలను డిజైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ ఇవ్వడం వల్లే, ముఖ్యంగా సోనియాగాంధీ వల్లే రాష్ట్రం ఏర్పాటైందన్న సందేశం వాడవాడకు చేరేలా వేడుకలు ఉండేలా ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News