Monday, June 17, 2024

వరంగల్ లో రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: వరంగల్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఓ ప్రేమజంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మా (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.  వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీల వద్ద నవజీవన్ ఎక్స్ ప్రెస్ కిందపడి సుష్మా, చెన్నకేశవ ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కూడా చనిపోయినట్టు సమాచారం. రెండు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. సుష్మా కనిపించడంలేదని ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు చేసుకున్నరనే విషయాలు బయటకు వస్తాయన్నారు. ఐఒఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ వ్యవహారానికి పెద్దలు అడ్డుచెప్పడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News