Monday, June 17, 2024

ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్2లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఇంతకుముదు కోల్‌కతాతో జరిగిన మొదటి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సఫలమయ్యారు. ఆరంభం నుంచే సన్‌రైజర్స్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశారు. దీంతో రాజస్థాన్ బ్యాటర్లు వేగంగా బ్యాట్‌ను ఝులిపించలేక పోయారు. ఓపెనర్ కాడ్‌మోర్ (10), కెప్టెన్ శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), రవిచంద్రన్ అశ్విన్ (0) విఫలమయ్యారు. మరోవైపు యశస్వి జైస్వాల్ (42), ధ్రువ్ జురెల్ (56) నాటౌట్ ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు, అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ను క్లాసెన్ (50), ట్రావిస్ హెడ్ (34) ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News