Monday, June 17, 2024

కులం విలనై విఫలమైన నా ప్రేమకథ:సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

మనసులు ఒక్కటైతే కులాంతరవివాహాలు మంచివే అని, వీటిని అడ్డుకోరాదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ విషయం చెపుతూ తన విఫల ప్రేమకథను కూడా వివరించారు. తాను అప్పట్లో ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పానని, అయితే వేరే కులం అమ్మాయి కావడంతో కుటుంబంతో పాటు ఆమె కూడా అంగీకరించలేదని, దీనితో ఈ ప్రేమను పక్కకు పెట్టి తాను తన కులం యువతిని పెళ్లాడాల్సి వచ్చిందని ,

ఇది తన విఫల ప్రేమకథ అని సభికుల చప్పట్ల నడుమ తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులాంతర వివాహాలకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా సహకరిస్తుందని , ఇది తన ఆన అన్నారు. కులవ్యవస్థ, సామాజిక సమానతల సృష్టికి ప్రయత్నాలు గౌతమ బుద్ధుడి కాలం, అంటే 12వ శతాబ్ధం నుంచి సాగుతూ వస్తున్నాయని, కన్నడ భగవానుడు బసవేశ్వరుడి కాలం నుంచి ఈ దిశలో అడుగులు పడుతూనే ఉన్నాయని, ఇది అనివార్యపు సంస్కరణల ప్రక్రియ అని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News