Monday, June 17, 2024

నకిలీ ఐడిలో యువతులకు వేధింపులు

- Advertisement -
- Advertisement -

యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మారం అశోక్ రెడ్డి బెట్టింగ్‌లో డబ్బులు పెట్టడానికి బానిసగా మారాడు. సిల్వర్‌బెట్777.కామ్, 99ఎక్స్‌చెంజ్,టీన్ పటీగోల్డ్, 1ఎక్స్ బెట్, బెట్ విన్నర్, డ్యాష్ రమ్మీ, మెల్‌బెట్ యాప్‌ల్లో బెట్టింగ్ కట్టేవాడు. బెట్టింగ్ కట్టడానికి డబ్బులు లేకపోవడంతో సోషల్ మీడియాలో నకిలీ ఐడిలో ఖాతాలు తెరిచాడు. అందులో ఉన్న పలువురు యువతులకు రిక్వెస్ట్ పంపించాడు.

ప్రణీత్ రెడ్డి పేరుతో స్నాప్ చాట్‌లో ఐడి ఓపెన్ చేసి దానికి స్పందించిన యువతితో కొద్ది రోజులు ఛాటింగ్ చేశాడు. తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో బాధిత యువతి తన ఫొటోలు పంపించింది. వీటిని అడ్డుపెట్టుకున్న నిందితుడు తనకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే వాటిని బయటపెడతానని బెదిరించడం ప్రారంభించాడు. బెట్టింగ్ పేరు చెప్పకుండా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అర్జంట్‌గా డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. వెంటనే రూ.14,00,000 పంపించాలని వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News