Monday, June 17, 2024

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో టెకీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శుక్రవారం ప్రకటించింది. హుబ్బలికి చెందిన టెకీ షోయబ్ అహ్మద్ మీర్జా అలియాస్ చోటు(35)ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. 2012లో జరిగిన ఉగ్ర కుట్ర కేసులో చోటు శిక్షపొందాడు. రామేశ్వరం కేఫ్ కేసులో అరెస్టయిన అనుమానితులలో ఇతను ఐదవ వ్యక్తి. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఇడి పేలుడు ఘటనకు సంబంధించి మూడు రోజుల క్రితం వివిధ రాష్ట్రాలలో సోదాలు జరిపిన ఎన్‌ఐఎ ఐదవ అనుమానితుడి పేరును నేడు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News