Tuesday, April 30, 2024

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి, పాత్రధారి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో సూత్రధారితోసహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శుక్రవారం అరెస్టు చేసింది. బాంబు పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాతోపాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్ సాజీబ్‌ను ఎన్‌ఐఎ బృందం కోల్‌కతా సమీపంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రామేశ్వరం కేఫ్‌లో ఐఇడిని షాజీబ్ అమర్చగా పేలుడుకు పథక రచన చేసింది తాహా అని అధికారులు తెలిపారు. నకిలీ పేర్లతో కోల్‌కతా సమీపంలోని స్థావరంలో తలదాచుకున్న ఎన్‌ఐఎ అధికారుల బృందం ఏప్రిల్ 12 తెల్లవారుజామున అరెస్టు చేసిందని వారు చెప్పారు.

ఎన్‌ఐఎ, కేంద్ర నిఘా సంస్థలు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్ర పోలీసులు సమన్వయంతో నిందితుల కోసం వేట సాగించి పట్టుకోగలిగారని అధికారులు చెప్పారు. ఈ ఇద్దరు నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమానాన్ని కూడా ఎన్‌ఐఎ గత నెల ప్రకటించింది. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లగల రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన ఐఇడి పేలుడు సంభవించింది. తొలుత ఈ కేసు దర్యాప్తును బెంగళూరు పోలీసులు చేపట్టగా అనంతరం మార్చి 3న ఎన్‌ఐఎ తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News