Monday, June 17, 2024

ఆర్‌టిసి బస్సు, కారు ఢీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండల శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమనగల్ మండలం రాంనుంతల సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్న శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (35), మెగావత్ నిఖిల్ (26), బుర్రా మణిదీప్ (25) లను మృతులుగా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను వెలికితీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News