Sunday, May 26, 2024

త్వరలో ఆర్‌టిసిలో 3వేల ఖాళీల భర్తీ

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ఆర్టీసిలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 3 వేల పోస్టుల ఖాళీల భర్తీకి ఆర్టీసి ప్రాతిపాదన తీసుకు వచ్చింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసి డ్రైవర్లను, కండక్టర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.ఆర్టీసి ఇదే ప్రాతిపాదనను ఆర్థిక శాఖ దగ్గరకు తీసుకెళ్లింది.

అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా ఆర్టీసి ప్రాతిపాదన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా తెలిసింది. ఇదే జరిగితే రెండు వేల డ్రైవర్ పోస్టులు, అలాగే శ్రామికులు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు సంబంధించిన మరో వెయ్యి పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 3 వేల ఆర్టీసి ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News