Monday, June 17, 2024

పాక్ ఎంపి వ్యాఖ్యకు కేజ్రీవాల్ చురక

- Advertisement -
- Advertisement -

భారత దేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్ ఎంపీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మా వ్యవహారాల్లో తల దూర్చకుండా , మీ దేశం సంగతి మీరు చూసుకోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీ మద్దతు ఏం అక్కరలేదంటూ హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల ఆరోవిడతలో భాగంగా కేజ్రీవాల్ , తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం సంబంధిత చిత్రాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి , ఎంపీ చౌదరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేస్తూ , ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ పెట్టారు. దానికి ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీనికి కేజ్రీవాల్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చారు. “ భారత్‌లో ఎన్నికలు అనేవి మా అంతర్గత వ్యవహారం. ప్రపంచం పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే మీలాంటి వారి జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు” అంటూ కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News