Monday, June 17, 2024

ముస్లింల ఓట్ల కోసం కూటమి ముజ్రా

- Advertisement -
- Advertisement -

దళితులు, వెనుకబడిన తరగతుల (బిసిల) రిజర్వేషన్ల కైంకర్యానికి ఇండియా కూటమి చేస్తున్న యత్నాలను భగ్నం చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శపథం చేశారు. ముస్లిం వోటు బ్యాంకు కోసం కూటమి ‘బానిసత్వానికి’ పాల్పడుతున్నదని, ‘ముజ్రా’ చేస్తున్నదని మోడీ ఆరోపించారు. బీహార్‌లోని కరకత్, పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గాల్లో వరుస ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ ప్రతిపక్ష కూటమి ‘బెదరింపులకు దిగుతోంది’ అని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని, అవినీతిని నిర్మూలించడానికి తాను ‘భయం లేకుండా’ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘సామాజిక న్యాయానికి పోరాటంలో కొత్త మార్గం చూపిన ప్రాంతం బీహార్. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిల హక్కులను లాక్కొని, ముస్లింలకు వాటిని మళ్లించాలన్న ఇండియా కూటమి వ్యూహాన్ని నేను భగ్నం చేస్తానని ఈ భూమిపై ప్రకటిస్తున్నా. వారు తమ వోటు బ్యాంకు సంతుష్టి కోసం బానిసలుగా ఉండి, ‘ముజ్రా’ ప్రదర్శించవచ్చు’ అని ప్రధాని అన్నారు.

పంజాబ్, తెలంగాణలలో కాంగ్రెస్ నేతలు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో డిఎంకె, టిఎంసి నేతలు బీహార్ వలస కార్మికులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు నొచ్చుకున్నారని కూడా మోడీ ఆరోపించారు. ‘తమ లాంతర్‌తో ముజ్రా చేస్తుండే ఈ ఆర్‌జెడి వారికి నిరసనగా మాట్లాడే ధైర్యం లేదు’ అని ఆయన అన్నారు. ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్న వారి మద్దతుపై ప్రతిపక్ష కూటమి ఆధారపడిందని కూడా మోడీ ఆరోపించారు. ఒబిసిల జాబితాలో కొన్ని ముస్లిం వర్గాలను చేర్చాలన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ముందుగా తాము రాజ్యాంగాన్ని మార్చాలని ప్రతిపక్ష కూటమి నిర్ణయించుకుందని, దాని వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు మళ్లించే తమ యత్నాలను కోర్టు కూడా తోసిరాజనలేదనిఆయన అన్నారు.“లిఖితపూర్వకంగా నా మాటలను ఖండించాలని వారిని సవాల్ చేస్తున్నాను. కాని వారికి అంతరాత్మ భయం ఉన్నందున వెనుకాడుతున్నారు’ అనిమోడీ చెప్పారు. అయితే, ప్రతిపక్ష కూటమి పరాజయం దిశలో సాగుతోందని,

‘జూన్ 4న ఫలితాలు వెలువడినప్పుడు ఆర్‌జెడి, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దుస్తులు చింపుకోవడం కనిపిస్తుంది. ‘కాంగ్రెస్ రాజ కుటుంబం ఓటమికి పూర్తి నెపం మల్లికార్జున్ ఖర్గేపైకి నెట్టి విదేశాల్లో విహారానికి వెళుతుంది’ అని మోడీ జోస్యం చెప్పారు. ‘పాకిస్తాన్ పేరేపిత ఉగ్రవాదాన్ని, నక్సల్ తిరుగుబాటును, అవినీతిని నిర్భయంగా రూపుమాపేందుకు మోడీ పాటు పడుతున్నాడు. భయం సృష్టించి ప్రతి అడుగులో నన్ను అడ్డుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నించింది’ అని ఆయన చెప్పారు. సర్జికల్ దాడులకు ఉపక్రమించడంలో, 370 అధికరణాన్ని రద్దు చేయడంలో తాను దృఢచిత్తంతో వ్యవహరించినట్లు మోడీ గుర్తు చేసుకుంటూ, అవినీతిపై కొరడా ఝళిపిస్తూనే ఉంటానని శపథం చేశారు. ‘ప్రతి ఎన్‌డిఎ అభ్యర్థికి వేసే ప్రతి వోటు స్థానిక ఎంపినే కాకుండా ప్రధాని ఎన్నుకోవడానికి’ అని గుర్తుంచుకోవాలని ప్రజలను మోడీ కోరారు. ‘మీరు ఇళ్లకు వెళ్లేటప్పుడు సమీపంలోని ఆలయాన్ని సందర్శించి, నా తరఫున అభివృద్ధి భారత్ కోసం ప్రార్థనలు చేయవలసింది’ అని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News