Monday, June 24, 2024

కాంగ్రెస్ హామీలన్నీ అమలుచేస్తే సన్యాసం చేస్తా: ఈటల

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరఫున బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. ఓటు సరైన వ్యక్తికి వేస్తే రాష్ట్రానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. అధికార దర్పనం ప్రదర్శించిన కెసిఆర్ ను ప్రజలు ఇంటికి పంపారని, ప్రస్తుత సిఎంకు అహంకారం నెత్తికెక్కిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి ఎంఎల్ సి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News