Monday, June 17, 2024

పిఒకె మనది.. దానిని స్వాధీనం చేసుకుంటాం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారత్‌లో అంతర్భాగమని, ‘మేము దానిని స్వాధీనం చేసుకుంటాం’ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం పునరుద్ఘాటించారు. పొరుగు దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని చెబుతూ ‘మనల్ని భయపెట్టేందుకు’ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ను అమిత్ షా తూర్పారబట్టారు. హమీర్‌పూర్ లోక్‌సభ సీటుకు బిజెపి అభ్యర్థి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మద్దతుగా ఉనా జిల్లాలోని అంబ్‌లో ఒక ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనది. అది మనతోనే ఉంటుంది. మేము దానిని స్వాధీనం చేసుకుంటాం’ అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల తొలి ఐదు దశల్లో 310 సీట్లు గెలుపొందారని, ‘400 పైచిలుకు’ లక్ష్యాన్ని ఆరవ, చివరి దశల్లో సాధించగలమని, కాంగ్రెస్ రాహుల్ గాంధీ కేవలం 40 సీట్లకు పరిమితం అవుతారని అమిత్ షా చెప్పారు. వృద్ధ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఎవరు ప్రధాని అవుతారని జనాన్ని అడగడం ద్వారా అమిత్ షా ఆ పార్టీని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని, ‘400 పైచిలుకు’ లక్షం సాధనకు దోహదం చేయాలని కూడా ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News