Monday, June 17, 2024

5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయమైన వారికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులు బాటు రైల్వేశాఖ కల్పించింది. అంతవరకు బుక్ అయిన టికెట్లలో ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చని చెబుతోంది. అనేక కారణాలతో ప్రయాణం రోజునే టికెట్ క్యాన్సిల్ చేసుకొనేవారు చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వేశాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతిటైన్ టికెట్ బుకింగ్ కోసం రైల్వేశాఖ రెండు చార్ట్‌లను ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఛార్ట్ అనేది రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. రెండో ఛార్ట్ రైలు స్టార్ట్ అవ్వడానికి ముందు రూపొందిస్తారు. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతించేవారు.

ఇప్పుడు రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు వెసులు బాటు కల్పించారు. కాబట్టి ట్రైన్ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్ / ఆఫ్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మొదట సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. దీనికోసం ముందుగా ఐఆర్‌సిటిసి యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్‌పై క్లిక్ చేస్తే , ఛార్ట్, వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా ఆన్‌లైన్ ఛార్ట్ వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేయొచ్చు. అక్కడ ట్రైన్ పేరు/ నంబర్ , తేదీ , ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి “గెట్ ట్రయిన్ ఛార్ట్ ”పై క్లిక్ చేయాలి వెంటనే తరగతుల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సీటు లేకుంటే సున్నా చూపిస్తుంది. కోచ్ నంబర్ , బెర్త్ , మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్ ప్రయోజనకరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News