Monday, June 17, 2024

మీ పదవికున్న గౌరవాన్ని కాపాడండి: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమిని ఉద్దేశించి ముజ్రాగా అభివర్ణించడంపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ప్రధాని తన పదవి గౌరవాన్ని కాపాడాలని ఆమె హితవు చెప్పారు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలను విమర్శిస్తూ ముజ్రా పదాన్ని ఉపయోగించారు. రాజనర్తకిలు చేసే నృత్యాన్ని ముజ్రాగా వ్యవహరిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ స్పందిస్తూ ఏ ప్రధాని ఇటువంటి భాషను ఉపయోగించలేదని విమర్శించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో తన మిత్ర పక్షం సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలసి ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక ప్రసంగిస్తూ మోడీ ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు. ప్రధాని పదవికి గౌరవమర్యాదలు ఇవ్వాల్సిన బాధ్యత మోడీకి ఉందని ఆమె చెప్పారు. ప్రధాని పదవిని తాము గౌరవిస్తామని ఆమె చెప్పారు. మోడీ నిజస్వరూపం ఇప్పడు కనపడుతోందని, మీ నిజ స్వరూపాన్ని ప్రజలకు ఎక్కువగా చూపించవద్దని ఆమె హోడీకి హితవు చెప్పారు. తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న విషయాన్ని ఆయన మరచిపోయారని, భవిష్యత్ తరాలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News