Monday, June 17, 2024

పారిస్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె

- Advertisement -
- Advertisement -

పారస్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సామూహిక సమ్మెకు దిగడంతో దాదాపు 70 శాతానికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. దీనివల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయని ఫ్రాన్స్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి నగరం సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమ్మె జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పారిస్ లోని ఓర్లీ విమానాశ్రయ నిర్వాహకులు తక్కువ సిబ్బందితో కాలం వెళ్ల దీస్తున్నారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆరోపిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన కొందరిని నియమిస్తున్నారని, ఇదే కొనసాగితే 2027 నాటికి రెగ్యులర్ సిబ్బంది కొరత ఏర్పడుతుందని , ఖాళీల భర్తీపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు..ఈ చర్యలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. సిబ్బందితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News