Monday, June 17, 2024

లోక్‌సభ సీట్ల వారీ డేటా విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఐదు దశలలో పోలైన వోట్ల సంఖ్యపై లోక్‌సభ నియోజకవర్గాల వారీ డేటాను ఎన్నికల కమిషన్ (ఇసి) శనివారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీసేందుకు తప్పుడు కథనాల సృష్టిలో, తప్పుడు వ్యూహాల్లోఒక విధానం ఉన్నదని ఇసి స్పష్టం చేసింది. పోలైన వోట్ల సంఖ్యలో ఏదైనా మార్పు చేయడం సాధ్యం కాదని ఇసి తెలిపింది. పోలింగ్ కేంద్రాల వారీ వోటింగ్ డేటాను తన వెబ్‌సైట్‌పై అప్‌లోడ్ చేయాలన్న ఎన్‌జిఒ అభ్యర్థనపై ఆదేశాల జారీకి సుప్రీం కోర్టు నిరాకరించిన మరునాడు తనదైన రీతిలో వోటర్ల పూర్తి సంఖ్యతో ఎన్నికల కమిషన్ వివరాలు వెలువరించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో వోటర్ల పూర్తి సంఖ్యను చేర్చేందుకు వోటర్లు వచ్చిన డేటా ఫార్మాట్‌ను మరింత విస్తరించాలని తాము నిర్ణయించినట్లు ఇసి తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News