Monday, June 17, 2024

ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్గొండరూరల్ : తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతి పెద్ద కుంభకోణం పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అరోపించారు. వరంగల్, నల్లగొండ,- ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌ఎసి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పారీ జిల్లా అధ్యక్షుడు నాగమషద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ హయాం నుంచే సివిల్ సప్లయ్ శాఖ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్‌సిఐకి అప్పగించేందుకు మధ్యవర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రైస్‌మిల్లర్ల అసోసియేషన్లోని కొంతమంది నాయకుల్లో అక్రమార్కులు ఉన్నారని, వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులకు లంచాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని వ్యాఖ్యా నించారు. రైస్‌మిల్లర్ల నుంచి గతంలో పలువురు నాయకులకు ముడుపులు ముట్టాయని, దీనిపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారు…
కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు తాము సహకరించామని బండి సంజయ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం, కెసిఆర్ కుటుంబం ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అదే తరహాలో కాంగ్రెస్ నాయకులు రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి వాటిని ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక, బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు ఎంఎల్‌సి ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ వారు ఎవరికీ ఇవ్వరని, వారిలో వారే ప్రభుత్వాన్ని కూలదోసుకుంటారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాం గ్రెస్ నాయకుడినీ ప్రజలు రోడ్లపై తిరగనిచ్చే పరిస్థితి ఉండదని, ఆరు గ్యారెంటీల సంగతి ఏంటని ప్రజలు నిలదీస్తారని తెలిపారు. విలేకరుల సమా వేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల నివేదిత రెడ్డి, కన్మంత్ రెడ్డి శ్రీదేవి రెడ్డి, పోతపాక సాంబయ్య, గడ్డం మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News