Monday, June 17, 2024

హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీ మోసం

- Advertisement -
- Advertisement -

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని, శిక్షణ ఇచ్చి ఉద్యోగం పెట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. విద్యార్థుల వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. నగరంలోని కుంచమ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో నిర్వాహకులు సంస్థను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ట్రైనింగ్‌తోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పెట్టిస్తామని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు కుంచమ్‌లో చేరారు. ఇలా చేరిన వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అంతేకాకుండా విద్యార్థుల అనిన్ని వివరాలు నిందితుల వద్ద ఉండడంతో వారి పేరుతో ఒక్కొక్కరి పేరుపై రూ.4లక్షలు పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకున్నారు.

విద్యార్థులకు శిక్షణ కొనసాగుతుండగానే సంస్థ బోర్డు తిప్పేసింది, దీనికితోడు ఫైనాన్స్ సంస్థలు విద్యార్థులకు రుణం కట్టాలని ఫోన్లు చేసి ఒత్తిడి తేవడంతో బాధితులు మంత్రి సీతక్కను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి రుణాల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తీసుకుని రావద్దని సంస్థలను ఆదేశించారు. కుంచమ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంస్థ సంబంధించిన బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి, కంపెనీ వల్ల ఎంత మంది విద్యార్థులు నష్టపోయారు, ఇది వరకు సంస్థపై ఏమన్న కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News