Tuesday, May 21, 2024

విరాట్ కోహ్లీ వర్సెస్ సునీల్ గావస్కర్… సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అలా ఆడితే పొగడ్తలుండవు: సునీల్ గావస్కర్

మంబై : బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు గావస్కర్ తీవ్రంగా ఖండించాడు. ఏ ఆటగాడినైనా అతని ఆటతీరును బట్టే వ్యాఖ్యనిస్థామని, ఒక ఆటగాడిని విమర్శించవలసిన అవసరం ఉండదన్నాడు. ఓపెనర్‌గా వచ్చి 15 ఓవర్ వరకూ క్రీజులో ఉండి 118 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తే దాన్ని స్లో బ్యాటింగ్ అని అంటారని గావస్కర్ తెలిపాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 43 బంతులు ఎదుర్కొని కేవలం 51 పరుగలు మాత్రమే చేశాడు. దీనిపై కామెంటర్లు, మాజీలు ఇది చాలా నిదానమైన ఇన్నింగ్స్ అని వ్యాఖ్యనించారు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ ‘చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్‌రేటు గురించి, స్పిన్‌లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో.. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదు” అని కోహ్లి కాస్త ఘూటుగా బదులిచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News