Wednesday, May 1, 2024

ప్రోస్టేట్ క్యాన్సర్ 85 శాతం ప్రాణాంతకం

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు రెండింతలు కానున్నాయి. ఇది తీవ్రస్థాయి ప్రాణాంతక పరిణామానికి దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. 2020 నుంచి 2040 మధ్యలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ క్రమంలో ఈ క్యాన్సర్ సోకిన వారు 85 శాతం వరకూ చనిపోతారని నిర్థారించారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌పై లాన్సెట్ కమిషన్ అధ్యయనం తరువాత నివేదిక వెలువడింది. ప్రత్యేకించి అల్ప, మధ్య ఆదాయ దేశాలు (ఎల్‌ఎంఐసి)ఈ క్యాన్సర్ పెరుగుదల వల్ల బాధిత దేశాలు అవుతాయి. ఆయా దేశాలలో ఇప్పుడు ఇటువంటి క్యాన్సర్‌కు సంబంధించి సరైన నిర్థారణ పరీక్షలు, సకాలంలో చికిత్సలకు ఏర్పాట్లు లేకపోవడం,

ప్రజలలో అవగావహన లేకపోవడం ఈ దేశాలలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు మరింతగా పెరగడానికి దారితీస్తుంది. 50 అంతకు మించిన వయస్సు వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని తగు విధంగా వ్యవహరించి, జీవన ఆహారశైలిని మార్చుకోవడం వంటి చర్యలకు దిగితే నియంత్రణకు వీలుంటుందని ఈ కమిషన్ నివేదిక ప్రధాన కర్త నిక్ జేమ్స్ తెలిపారు. వెన్నెముకకు క్యాన్సర్ సోకడం ఈ ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిని ప్రభావితం చేయడం వల్ల వయస్సు మళ్లిన వారిలో ఉండే అతి మూత్రవిసర్జన, మూత్రకోశ సమస్యలు తీవ్రతరం అవుతాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News