Tuesday, May 21, 2024

లండన్‌లో కత్తితో వ్యక్తి స్వైరవిహారం.. బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఈశాన్య లండన్‌లో మంగళశారం ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో ఒక 13 ఏళ్ల బాలుడు మరణించగా అనేకమంది గాయపడ్డారు. సంఘటనా స్థలంలో 36 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాద దాడి కాదని, ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి కూడా కాదని పోలీసులు తెలిపారు. చేతిలో కత్తి పట్టుకుని ఒక వ్యక్తి రోడ్డు మీద నడవడం సిసిటివి కెమెరాలలో రికార్డు అయింది. హైనాల్డ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఇంటి వద్ద జరిగిన కత్తిపోట్ల సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News