Tuesday, May 21, 2024

ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై జెడిఎస్ సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అశ్లీల వీడియోల కుంభకోణంలో చిక్కుకున్న తమ హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను జెడి(ఎస్) మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని పార్టీ తెలిపింది. జెడి(ఎస్) కోర్ కమిటీ మంగళవారం హుబ్బలిలో సమావేశమై ప్రజ్వల్ రేవణ్ణ స్పెన్షన్‌కు సిఫార్సు చేసింది. వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు హెడ్ దేవె గౌడ దీన్ని అమలు చేశారు.

కాగా..ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడే కావడం విశేషం. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు మీడియాలో విస్తృతంగా చలామణిలో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పరిణామం పార్టీని, పార్టీ నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేసిందని సస్పెన్షన్ ఉత్తర్వులలో పార్టీ పేర్కొంది. ఈ శృంగార లీలలకు సబంధించిన వీడియోల దర్యాప్తు కోసం కర్నాకటలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి కెఆర్ శివకుమార్ సంతకం చేసిన సస్పెన్షన్ ఉత్తర్వును జెడి(ఎస్) జాతీయ అధ్యక్షుడి ఆమోదం మేరకు మీడియాకు విడుదల చేశారు. హసన్ నుంచి బిజెపి-జెడి(ఎస్) ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభకు ప్రజ్వల్ పోటీ చేస్తున్నారు. గత శుక్రవారం(ఏప్రిల్ 26) ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. 33 ఏళ్ల ప్రజ్వల్ దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డి రేవణ్ణ కుమారుడు. హెచ్‌డి రేవణ్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ మంత్రి కూడా. ప్రజ్వల్ బాబాయ్ హెచ్‌డి కుమారస్వామి జెడి(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News