Saturday, July 27, 2024

నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను : నటుడు శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

నేను హైద్రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం.. మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొందరపడటంలో తప్పులేదనిపించింది.

ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన్ అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు’ అంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News