Wednesday, October 9, 2024

నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

- Advertisement -
- Advertisement -

తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని సినీ నటి హేమ తెలిపారు. బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో తన పేరు వచ్చినట్టు తెలిసిందన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఛార్జిషీట్ తనకు వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. డ్రగ్స్ రిపోర్ట్‌లో తనకు నెగిటివ్ వచ్చిందని ఛార్జిషీట్‌లో దాఖలు చేశారని తెలిసిందని చెప్పారు. ఎండిఎంఎ డ్రగ్స్ తాను తీసుకోలేదని నటి హేమ పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

రేవ్ పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని, ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నారని ఛార్జిషీట్‌లో వెల్లడించారు. తెలుగు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఛార్జిషీట్‌లో తెలిపారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలకంగా వ్యవహరిం చినట్లు గతంలోనే పోలీసులు తెలిపారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి 1,086 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో నటి హేమ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News