Saturday, July 27, 2024

రాయబరేలి హనుమాన్ గుడిలో రాహుల్ పూజలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం రాయబరేలిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఐదవ దశ పోలింగ్ సోమవారం రాయబరేలిలో జరిగింది. తాను పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన సందర్శించారు. రాయబరేలికి ఇంతకుముదు ఆయన తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. హనుమాన్ ఆలయంలో రాహుల్ అర్చనలు జరిపారు. ఆయన ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు సెల్ఫీ కోసం పలువురు ఆయన చుట్టూ చేరారు. మీడియా సిబ్బంది కొందరు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News