Saturday, July 27, 2024

నిపుణులు చెబితేనే కాళేశ్వరానికి మరమ్మతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. సేకరణ పూర్తి బాధ్యతను క లెక్టర్లకు అప్పగించింది. తడిసిన ధాన్యానికి మ ద్దతు ధర అందించాలని కీలక నిర్ణయం తీసుకుం ది. సోమవారం సచివాలయంలో సిఎం రేవంత్‌రె డ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాల ను రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో కలిసి మీడియాకు వెల్లడించారు. నేటి నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను పరిశీలించాలని కేబినెట్ ఆదేశించిందన్నారు. వచ్చే సీజన్ నుంచి సన్నబియ్యానికి కనీస మద్ధతు ధరపై రూ.500లు బోనస్ ఇస్తామని ఆయన తెలిపారు. సన్న బియ్యా న్ని వ్యవసాయ అధికారులు గుర్తిస్తారని ఆయన పే ర్కొన్నారు. ఇప్పటికే 36 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు.

ధా న్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోపే రైతుల ఖాతా లో నగదు జమ చేస్తామన్నారు. ఎమ్మెస్పీ ధరకే త డిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పబ్లి క్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఈ సీకి లే ఖ రాయాలని నిర్ణయించామన్నారు. అనుమతి లభిస్తే బహిరంగసభ ఏర్పాటు చేసి దానికి తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రముఖులను, ఉద్యమకారులను ఆహ్వానిస్తామని, అక్కడే వారికి సన్మానం చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం ప్రజా ప్రభుత్వమని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని, వాటిని రైతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విడిగా విత్తనాలు కొనుగోలు చేయవద్దని, సర్టిఫైడ్ దుకాణం లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేసి ఆ రశీదు ను రైతులు దగ్గర పెట్టుకోవాలని ఆయన సూచించారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా రాష్ట్రంలోని స్కూళ్ల నిర్వహణ చేపడతామని ఆయన పేర్కొన్నా రు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీధర్‌బాబు అధ్యక్షనత కేబినెట్ సభ కమిటీని వేశామన్నారు. అన్నారం, సుం దిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్‌లలో నీటి నిల్వ చేయకూడదని ఎన్డీఎస్‌ఎ మధ్యంతర నివేదిక ఇచ్చిందన్నారు. అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల్లో గేట్లు ఎప్పుడు తెరిచే ఉంచాలని, నీటిని నిల్వ చేయవద్దని, బ్యారేజ్ డ్యామేజ్‌లను సరి చే యాలని ఎన్డీఎస్‌ఎ ఈ నివేదికలో తెలిపిందన్నారు. మూడు కంపెనీలతో ఈ డ్యామేజ్‌ల పరిశీలన చేయాలని, సాధ్య పడితే తరువాయి 6లో
నీటిని నిల్వ చేయకుండా నీటిని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించామన్నారు. బ్యారేజ్‌ల సేఫ్టీపై ఎక్స్‌పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయించి నివేదిక తీసుకుంటామన్నారు. ఆ నివేదిక ఆధారంగానే మరమ్మతులు చేపడుతామని ఆయన తెలిపారు. తక్కువ ఖర్చుతో నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలని కేబినేట్ నిర్ణయించిందన్నారు.

రైతులకు నష్టపరిహారం అందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ తరుగు లేకుండా చూస్తామన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. విద్యపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందన్నారు. విద్యా వ్యవస్థలో మా మార్క్‌ను చూపిస్తామన్నారు. రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులు సృష్టిస్తామని, అమ్మ పాఠశాల కమిటీ, మౌలిక సదుపాయాల కోసం రూ.600 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు.

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వం పాఠశాలలు గొప్పగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. జూన్ 12వ తేదీ లోపు పాఠశాలల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. 2019లోనే మెడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలు మొదలయ్యాయని, దీనిపై ఎన్‌డిఎస్‌ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందన్నారు. నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని లేదంటే బ్యారేజీకి పూర్తి స్థాయిలో ప్రమాదం జరుగుతుందని, ఏ ప్రత్యామ్నాయ మార్గాలను చూసినా బ్యారేజ్ నిలుస్తుందన్న నమ్మకం ఇవ్వలేమని ఈ నివేదికలో ఉందని ఆయన తెలిపారు. జియో ఫిజికల్, జియో టెక్నీకల్ రిపోర్టులు వచ్చిన వెంటనే వేగవంతంగా పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. సాంకేతిక నిపుణులు ఏదీ చెబితే అది చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కావొద్దన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.

20 ఏళ్ల క్రితమే రుణమాఫీ చేశాం: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులపై ఎవరికి ప్రేమ ఉందో అందరికీ తెలుసన్నారు. 20 ఏళ్ల క్రితం రుణమాఫీ కింద కోట్ల రూపాయలను చేశామని ఆయన తెలిపారు. ధర్నాల పేరుతో కొన్ని పార్టీలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ లక్ష రూపాయల రుణమాఫీ ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వ హయాంలో 5,600 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు రావాలి, – కాంగ్రెస్ రావాలని తాము ఎన్నికల్లో నినాదం ఇచ్చామన్నారు. ప్రస్తుతం విద్యా రంగాన్ని మారుస్తాం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News