Tuesday, May 21, 2024

కరోనా జన్యు గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు

- Advertisement -
- Advertisement -

చైనాలో వెలుగు చూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (కొవిడ్ 19) జన్యు సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు బైఠాయింపు నిరసనలో ఉన్నారు. తన ల్యాబ్‌లో నుంచి అధికారులు బయటకు పంపివేసిన తరువాత ఆయన నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వైరాలజిస్ట్ ఝాంగ్ యోంగ్‌ఝెన్ కొంత కాలంగా చైనా అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన పని చేస్తున్న ల్యాబ్ నుంచి వెళ్లిపోవాలి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనితో ఆయన అదే ల్యాబ్ ఎదుట నిరసనకు దిగారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల తమ చర్యల పరిశీలనను అడ్డుకోవడానికి చైనా ప్రభుత్వం శాస్త్రవేత్తలపై ఏవిధంగా ఒత్తిడి తెస్తున్నదో, వారిని నియంత్రిస్తున్నదో ఇది సూచిస్తోంది.

కాగా, తనతో పాటు తన బృందాన్ని కూడా ప్రయోగశాల నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించినట్లు వైరాలజిస్ట్ ఒక సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివారం నుంచి ల్యాబ్ వెలుపలే కూర్చొని నిరసన చేపట్టినట్లు ఆయన తన పోస్ట్‌లో తెలిపారు. అయితే, ఆ పోస్ట్‌ను ఆ తరువాత ఆయన తొలగించినప్పటికీ కార్యాలయం వెలుపలే ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించాలని మీడియా కోరగా, మాట్లాడేందుకు అనువైన పరిస్థితులు లేవని ఆయన సమాధానం ఇచ్చారు. కొవిడ్ 19కి కారణమైన వైరస్ సీక్వెన్స్‌ను 2020 జనవరిలో ప్రచురించిన మొదటి శాస్త్రవేత్తగా ఝాంగ్ నిలిచారు. ఆనాటి నుంచి ఆయనపై వేధింపులు మొదలైనట్లు సమాచారం. డిమోషన్లతో పాటు పలు కార్యక్రమాల్లో బహిష్కరణలు వంటి చర్యలను ఎదుర్కొంటున్న క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News