Saturday, May 18, 2024

మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాపై కేసు

- Advertisement -
- Advertisement -

ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను షేర్ చేశారని ఆరోపిస్తూ మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్‌తోపాటు 16 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఆ ఫేక్ వీడియాలో అమిత్ షా ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు చెదిన రిజర్వేషన్ హక్కులను రద్దు చేస్తామని ప్రకటించినట్లు సృష్టించారు.

ముంబై బిజెపి నాయకుడు ప్రతీప్ కార్పే సోమవారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర హోం మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షాను అప్రతిష్ట పాల్జేసేందుకు ఈ డీప్ వీడియోను సృష్టించి దాన్ని ఇంటర్‌నెట్‌లో నిందితులు విస్తృతంగా ప్రచారం చేశారని కార్పే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ డీప్ ఫేక్ వీడియాలో అమిత్ షా ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిల రిజర్వేషన్ హక్కులను రద్దు చేస్తామంటూ ప్రకటించినట్లు సృష్టించారని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ డీప్‌ఫేక్ వీడియోకు మూలాధారమైన అసలు వీడియోలో అమిత్ షా చెప్పిన సంభాషనలు వేరే విధంగా ఉన్నాయి. బిజెపి అధికారంలో వస్తే ముస్లింలకు రాజ్యాంగపరంగా కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసి ఆ హక్కును తెలంగాణలోని ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిలకు అందచేస్తామని అమిత్ సా ప్రకటించడం ఓరిజినల్ వీడియోలో ఉంది. అమిత్ షా ప్రసంగాన్ని డీప్ ఫేక్ వీడియోగా సృష్టించిన నిందితులు దాన్ని వివిధ సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా పంపిణీ చేశారని కార్పే తెలిపారు. వెంటనే ఈ డీప్ ఫేక్ వీడియోను ఇంటర్‌నెట్ నుంచి తొలగించి నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News