Saturday, June 1, 2024

భారత్ మసాల దినుసుల అమ్మకాలపై నేపాల్ లో నిషేధం

- Advertisement -
- Advertisement -

కాట్మాండు: భారత్ కు చెందిన ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాల దినుసులపై నేపాల్ తాజాగా నిషేధం విధించింది. ఇదివరలో సింగపూర్, హాంకాంగ్ లు కూడా వీటిపై నిషేధం విధించాయి. వాటిలో హానికారక రసాయనాలుండడంతో ఈ నిషేధం విధించింది. నేపాల్ కు చెందిన ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఈ  రెండు బ్రాండ్ల దినుసులపై పరీక్షలు చేయగా క్యాన్సర్ కారక క్రిమిసంహారిణి ‘ఎథనైల్ ఆక్సైడ్’ ను వీటిలో కనుగొన్నది. దాంతో వాటి అమ్మకాలపైనే కాక, దిగుమతులపై కూడా నిషేధం విధించింది. ఈ విషయాన్ని నేపాల్ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు.

ఎవరెస్ట్, ఎండిహెచ్ బ్రాండ్ల దినుసులపై న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించాయి. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాయా లేవా అని చూస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News