Tuesday, May 21, 2024

ఎన్నికల్లో అలజడి రేపడానికే సిఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీస్ సమన్లు:జైరామ్ రమేశ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీపోలీస్‌లు సమన్లు పంపడం “స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఉన్న ఎన్నికల శవ పేటికలో గోరు గుచ్చడమే ” అని కాంగ్రెస్ పార్టీ మంగళవారం తీవ్రంగా తూర్పారబట్టింది. బీజేపీ అవకాశాలకు ముఖ్యమంత్రి రేవంత రెడ్డి టార్పెడోలా పేలే ఆయుధంగా మారతాడని ప్రధాని నరేంద్రమోడీ భయపడుతున్నారా ? అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అమిత్‌షా ఫేక్ వీడియో ప్రసారం కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే1న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీస్‌లు సమన్లు పంపిన మరునాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ( కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ ప్రధాని పై విమర్శలు సంధించారు. తెలంగాణలో ప్రధాని ఎన్నికల ర్యాలీలకు ముందుగా రమేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు ?తెలంగాణకు ఇస్తానని హామీ ఇచ్చిన నిధులు ఎక్కడ ? నిజామాబాద్‌లో

జాతీయ పసుపు బోర్డును బీజేపీ నెలకొల్పగలుగుతుందా ?” అని ప్రశ్నలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫేక్ వీడియోలను బీజేపీ సృష్టించి, ప్రచారం చేస్తుండగా, ఏమాత్రం కిమ్మనని ఢిల్లీ పోలీస్‌లు ఇప్పుడు ప్రధాని మోడీ ప్రేరేపణతో కాంగ్రెస్ నాయకుల తలుపులు తడుతున్నారని రమేశ్ విమర్శించారు. పోలీస్‌ల చర్య ద్వంద్వ వైఖరే కాకుండా తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమేనని వ్యాఖ్యానించారు. ఏయే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించారో ఆయా రాష్ట్రాలపై నిర్లక్షం వహించడం ప్రధాని మోడీకి అలవాటేనని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణపై పగదీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న అలక్షాన్ని ఉదహరిస్తూ తెలంగాణకు కేంద్రం నుంచి రావలసిన రూ. 4000 కోట్ల జిఎస్‌టి నష్టపరిహారం రాలేదని, నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ. 24, 205 కోట్లు అందలేదని, వెనుకబడిన జిల్లాల అభివృద్దికి రూ 1800 కోట్ల గ్రాంటు మంజూరు కాలేదని ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News